యాంకర్ రవి మొత్తానికి బయటపెట్టాడు..!

-

బుల్లితెర మీద యాంకర్ గా తన ప్రతిభ చాటుతూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రవి అతని పర్సనల్ లైఫ్ కు సంబందించిన విషయాలను ఎప్పుడు బయటకు రానివ్వలేదు. మేల్ యాంకర్స్ అంతా తమ పెళ్లి విషయాన్ని బయటపడనివ్వరు. ఇప్పటికి యాంకర్ రవికి పెళ్లైందా లేదా అన్నది పెద్ద డౌట్. తాము చేస్తున్న షోలకు తమ పర్సనల్ లైఫ్ విషయాలు ఎక్కడ అడ్డొస్తాయో అని వాళ్ల భయం. అయితే అది ఒక్కోసారి అనర్ధాలకు దారి తీస్తుంది.

పటాస్ షోలో యాంకర్ రవి, శ్రీముఖి చేసే అతి అందరికి తెలిసిందే. అంతకుముందు లాస్యతో రవికి లింక్ పెట్టిన జనాలు కాస్త ఇప్పుడు శ్రీముఖితో అతన్ని జత చేశారు. వాళ్లు కూడా ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ప్రవర్తించే వారు. ఇదిలాఉంటే ఏమైందో ఏమో కాని సడెన్ గా యాంకర్ రవి తన పర్సనల్ లైఫ్ విషయాలను ఫోటోలతో సహా బయటపెట్టేశాడు. తనకు ఆల్రెడీ పెళ్లైందని.. తన భార్య పేరు నిత్య సక్సేనా అని.. తనకు మూడేళ్ల పాప కూడా ఉందని.. తన పేరు వియా అని మొత్తం ఫ్యామిలీ డీటైల్స్ విత్ ఫోటోస్ ఫేస్ బుక్ లో పెట్టాడు రవి. ఇన్నాళ్లకైనా రవి తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నందుకు కొందరు ఆడియెన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. కొందరు మాత్రం ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రవి బ్యాచిలర్ అనుకుంటున్న కొందరికి ఈ ఫోటోలతో సమాధానం దొరికేసినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version