అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఆ స్టార్ హీరోతోనే.. స్కెచ్ అదిరిందిగా..!

-

టాలీవుడ్​లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో ఒకడు అనిల్ రావిపూడి. ఎంతటి స్టార్ హీరోతో అయినా ఫన్ చేయించడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ఈ దర్శకుడి సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువ. అందుకే స్టార్ హీరోలు కూడా అనిల్​తో వర్క్ చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్​తో ఎఫ్-2, ఎఫ్-3 సినిమాల్లో పనిచేశాడు. తాజాగా బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి చేస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్​ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం తర్వాత అనిల్​ రావిపూడి చేయబోయే సినిమా ఏంటనే విషయమై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అయితే అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వెంకీ, బాలయ్య వంటి సీనియర్ హీరోలతో పని చేసిన అనిల్.. కింగ్​ నాగార్జున – మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే మిగిలింది. అయితే ఈ ఇద్దరిలో ఇప్పుడు చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్​తో సినిమా చేయనున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024లో చిరంజీవి – అనిల్​ రావిపూడి కాంబో మొదలు కావొచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version