Ram Charan: రామ్ చరణ్‌తో అంజలి రొమాన్స్!

ప్రజెంట్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైమ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్.. తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ సీ 15’సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినాయం చేస్తారని, యంగ్ పాత్రలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఓల్డ్ పాత్రలో రామ్ చరణ్ తో అంజలి పెయిర్ గా కనిపించబోతున్నదని టాక్. ఓ ల్డ్ రోల్ రామ్ చరణ్ తో అంజలి రొమాన్స్ వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నదని తెలుస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ కు భారీ బడ్జెట్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమకూర్చారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ సగం పూర్తయిందని టాక్. హైదరాబాద్, పుణేలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన శంకర్.. ప్రజెంట్ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల రామ్ చరణ్ పంచకట్టులో ఉన్న ఫొటోలు లీక్ కాగా, అవి సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఆ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని ఈ సందర్భంగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి-చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్.. ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నారు.