ఇండియన్ 2లో ఆయన కూడానా..!

-

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో 1996లో వచ్చి సంచలన విజయం అందుకున్న సినిమా ఇండియన్ అదే తెలుగులో భారతీయుడుగా డబ్ అయ్యింది. ఆ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇక 23 ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వల్ వస్తుంది. శంకర్, కమల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీక్వల్ సినిమాకు అదనపు ఎట్రాక్షన్ గా బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇండియన్ 2లో ఇప్పటికే అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని తెలుస్తుండగా.. సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జూనియర్ బచ్చన్ అభిషేక్ కూడా ఉంటాడని తెలుస్తుంది. సినిమాలో అక్షయ్ విలన్ గా నటిస్తుండగా మరో ఇంపార్టెంట్ రోల్ లో అభిషేక్ కనిపిస్తాడట. ఇందుకు సంబందించిన చర్చలు ముగిశాయట త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇస్తారట. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఇండియన్ 2 సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కొరియన్ భామ బేయ్ సుజి కూడా ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version