పెళ్లైన హీరోపై మనసు పడ్డ హీరోయిన్

-

కోలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2లో హాట్ కంటెస్టంట్ గా పేరు తెచ్చుకున్న యషిక ఆనంద్ ఈమధ్య తన కామెంట్స్ తో విమర్శలపాలవుతుంది. మోడల్ గా క్రేజ్ తెచ్చుకున్న యషిక ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది. ఆమధ్య కరెన్సీ నోట్ల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి అందరి చేత చీవాట్లు పెట్టించుకున్న యషిక ఇప్పుడు పెళ్లైన హీరోతో మళ్లీ పెళ్లికి రెడీ అంటూ మరో సంచలన కామెంట్ చేసి బుక్కయ్యింది.

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన ఒప్పుకునే ఇప్పుడు తనతో పెళ్లికి రెడీ అన్నది యషిక ఆనంద్.. జ్యోతికతో పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సూర్యతో పెళ్లికి సిద్ధమని చెప్పిన యషిక మీద నెటిజెన్లు మండిపడుతున్నారు. పెళ్లైన హీరోని ప్రేమించడం ఏంటని ఆ హీరో ఫ్యాన్స్ కూడా యషిక మీద ఫైర్ అవుతున్నారు. ఎలాగోలా వార్తల్లో ఉండాలని చేస్తుందో లేక ఆమె చేసేవే అలా అవుతున్నాయో తెలియదు కాని పెళ్లైన హీరోతో రిలేషన్ కావాలని చెప్పిన యషిక గురించి కోలీవుడ్ సోషల్ మీడియాలో వేడి వేడి చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version