మెగా జట్టులో మరో హీరో.. వైష్ణవ్ తేజ్ సినిమా స్టార్ట్..!

-

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో కూడా వచ్చేస్తున్నాడు. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఈరోజు ఉదయం ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ ఎంట్రీతో మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి సరిగ్గా 11 మంది ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది.

అంటే ఓ క్రికెట్ జట్టుకి సరిపడా అన్నమాట. చిరంజీవి వేసిన పూల బాటలో మిగతా హీరోలు వెళ్తున్నారు. అయితే ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నా ఆ తర్వాత వారి సొంత టాలెంట్ తోనే నెగ్గుకు రావాలి. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మెగా హీరోల లిస్ట్ అందరికి తెలిసినా వారెవరో మీరు చూడండి. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, నిహారిక కొణిదెల, విష్ణవ్ తేజ్. నిహారిక ఒక్కతే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా నాగబాబు హీరోగా చేయట్లేదు కాని నటుడిగా కొనసాగుతున్నాడు. వైష్ణవ్ తేజ్ రంగస్థలం లాంటి పిరియాడికల్ డ్రామా సినిమా కథతో ఎంట్రీ ఇస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version