చరణ్ తో మరో ‘జెర్సీ’ చేస్తాడా..?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన వరూస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలు చేస్తున్న చరణ్ ఆ సినిమాల తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరక్షన్ లో పాన్ ఇండియా వైడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ సినిమా తర్వాత జెర్సీ తో నేషనల్ అవార్డ్ అందుకునేలా చేసిన డైరక్టర్ గౌతం తిన్ననూరి తో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Another Jersey for Ram Charan Gautham Tinnanuri movie Confirmed

కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సో చరణ్ తో మరో జెర్సీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు గౌతం. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో రామరాజు పాత్రలో తన నట విశ్వరూపం చూపించనున్న చరణ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో చెలరేగనున్నాడు. ఇక శంకర్ సినిమాతో పాటుగా గౌతం తిన్ననూరి సినిమాను ఓకే చేశాడని తెలుస్తుంది. మొత్తానికి చరణ్ వరుస సినిమాలతో మెగా ఫ్యాన్స్ స్పెషల్ ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాడు.