మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో ఈ భామ అదరగొట్టింది. ఆ సినిమాలో బోల్డ్గా నటించి కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ భామ అందం, నటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక బోల్డ్ సీన్స్లో అనుపమ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందంటూ కామెంట్లు కూడా చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ మల్లు బ్యూటీ టిల్లు స్క్వేర్ మూవీ సక్సెస్ను హాయిగా ఎంజాయ్ చేస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటుంది. ‘టిల్లు స్క్వేర్’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది. దీనికి అనుపమ పరమేశ్వరన్ హాజరైంది. ఈ ఈవెంట్కు అనుపమ బ్లాక్ శారీలో వచ్చింది. నలుపు రంగు చీరలో కళ్లకు కాటుక పెట్టుకుని నుదట నలుపు రంగు బొట్టు, కొప్పులో తెల్లటి మల్లెపూలు పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ఇక ఈ చీరకట్టులో నిండుగా కనిపిస్తూ సినిమాలో తన క్యారెక్టర్కు పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.