విస్కీ లేకుండా ఉండ‌లేనంటున్న అనుప‌మ‌.. షాక్ అయిన ఫ్యాన్స్‌

హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అంటే యూత్ లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆమె క్యూట్ ఎక్స్ ప్రెష‌న్ కు ఫిదా కాని వారంటూ ఉండ‌రు. ఆమెను నిత్యం యూత్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూనే ఉంటుంది. ఆమె కంటూ ప్రత్యేకంగా సోష‌ల్ మీడియాలో అభిమానుల గ్రూప్ లు కూడా ఉన్నాయి. ఇక ఈ అమ్మ‌డు లేటెస్టుగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అవేంటే చూసేద్దామా.


‘నాకు విస్కీ అంటే ప్రాణం. అది లేకుండా ఉండలేను’ అని ఒక్క సారిగా బాంబ్ పేల్చింది ఈ బ్యూటీ. అయితే విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అనుప‌మ మందు తాగుతుందా అని మీరు కూడా న‌మ్మేరు. ఎందుకంటే విస్కీ అంటే ఆల్కాహాల్ కాదండోయ్‌. అది త‌న కుక్క‌పిల్ల పేరు. ఇంకో దాని పేరు ర‌మ్ అని చెప్పింది. మూడో దాని పేరు తాడి అని చెప్పింది. తాడి అంటే క‌ల్లు అని కూడా అర్థం వ‌స్తుంది. అయితే ర‌మ్‌, తాడి కుక్క పిల్ల‌లు ఇప్ప‌టికే చ‌నిపోయాయంట‌. దీంతో విస్కీని వాటి గుర్తుగా పెంచుకుంటోందంట‌. కుక్క పిల్ల‌ల‌కు ఆల్కాహాల్ బ్రాండ్ల పేరు పెట్టి ఆగం చేస్తోంది ఈ కేర‌ళ కుట్టి. ప్ర‌స్తుతం ఆమె చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.