స్వీటీ రిటైర్మెంట్ న్యూస్.. షాక్ లో ఫ్యాన్స్..!

-

స్వీటీ అనుష్క సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నా అంటే అవునన్నట్టే సంకేతాలు వస్తున్నాయి. కమర్షియల్ హీరోయిన్ గానే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ ప్రత్యేకత వచ్చేలా చేసిన అనుష్క బాహుబలి-2, సింగం 3, భాగమతి తర్వాత ఏ సినిమా చేయట్లేదు. అయితే కోనా వెంకట్ డైరక్షన్ లో మాధవన్ హీరోగా ఓ సినిమా చేస్తుందని అంటున్నారు.

ఇదే కాకుండా గౌతం మీనన్ తో ఒక సినిమా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా అనుష్క హీరోయిన్ అని అంటున్నారు. కాని ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియలేదు. 36 ఏళ్లు వచ్చిన అనుష్క సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

స్వీటీ సినిమాలకు రిటైర్మెంట్ అంటే నిజంగానే ఆమె ఫ్యాన్స్ కు చేదు వార్త అన్నట్టే. ఆఫ్టర్ మ్యారేజ్ సమంతలా సినిమాల్లో నటిస్తుందా లేక సినిమాలకు దూరంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version