చావును చూసి రావడమంటే ఇదే.. వీడియో

-

ఓ యువతి.. చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. చావును చూసి వచ్చింది. నిజంగా ఆ యువతికి ఇంకా భూమ్మీద నుకల్లున్నాయి కానీ.. లేకపోతే.. స్పీడ్ గా వెళ్తున్న ట్రెయిన్ నుంచి జారిపడటమేంటి… అదే సమయంలో పక్కన ఉన్న ట్రాక్ నుంచి వేరే ట్రెయిన్ వెళ్లడమేంటి.. ట్రెయిన్ కింద పడబోతున్న ఆ యువతిని ట్రెయిన్ లోని ప్రయాణికులు రక్షించడమేంది.. అసలు ఇదంతా ఓ కలలా అనిపించడం లేదు.. కలయితే కాదు.. నిజమే ఎందుకంటే.. ఈ వీడియో చూశాక.. నా చేయి గిల్లుకుంటే నొప్పి పుట్టింది నాకు. అంటే ఇది నిజమేనా? ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలే.. ముందు తనను పైకి లాగిన ప్రయాణికులకు చేతులెత్తి నమస్కరించాలి. క్షణం ఆలస్యమయినా.. ఆ అమ్మాయి ట్రెయిన్ కింద పడి ఉండేది.

ఇంతకీ ఏం జరిగిందో సరిగ్గా చెప్పవోయ్.. అని అంటారా? ముంబైలోని సీఎస్టీ లో కల్యాణ్ వెళ్లే లోకల్ ట్రెయిన్ ఎక్కింది ఓ యువతి. ఆమెది థానే సమీపంలోని దివా. ట్రెయిన్ వెళ్తోంది. చాలా స్పీడ్ గా వెళ్తోంది. రష్ కూడా లేదు. కానీ.. ఆ యువతి వచ్చి ఫుట్ బోర్డు వద్ద నిలుచున్నది. చెవిలో ఇయర్ ఫోన్స్. ఫోన్ మాట్లాడుతున్నది. అప్పటికే ఘాట్ కోపర్ స్టేషన్ దాటింది. విక్రోలి స్టేషన్ రాబోతోంది. అప్పుడే ఆ యువతి ఫుట్ బోర్డ్ మధ్యలో ఉన్న పోల్ తో ఏదో విన్యాసం చేయబోయింది. పట్టు తప్పింది. ట్రెయిన్ కింద పడబోయింది. అదే సమయంలో పక్కన ట్రాక్ పై మరో లోకల్ ట్రెయిన్ వెళ్తోంది. వెంటనే ఫుట్ బోర్డు వద్ద ఉన్న మిగితా ప్రయాణికులు తనను పైకి లాగారు. అంతే.. క్షణాల్లో చావును చూసి వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version