స్వీటీ కెరీర్ లో మార్చ్ 12 గుర్తుండిపోయే రోజు…!

-

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. ప్రస్తుతం ఎంత మంది యువ హీరోయిన్స్ వచ్చినా సరే ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు. అగ్ర హీరోలతో సినిమా అనగానే ఆమె పేరునే పరిశీలిస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె హీరోలతో సినిమాలు చేయకుండా సోలోగా చేస్తుంది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసిన సంగతి తెలిసిదే.

ప్రభాస్, మహేష్ బాబు, బాలకృష్ణ సహా పలువురు హీరోల పక్కన ఆమె ఆడిపాడింది. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకునేవి బాహుబలి, అరుంధతి సినిమాలు. బాహుబలి రెండు భాగాలతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. తాజాగా ఈ భామ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె చెవిటి మూగ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ భామ సినిమాలు చేయడం మొదలుపెట్టి నేటికి అంటే మార్చ్ 12 కి సరిగా 15 ఏళ్ళు. నాగార్జున హీరోగా సూపర్ సినిమాలో నటించింది ఈ హీరోయిన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె టాలీవుడ్ లో, తమిళంలో ఎందరో హీరోల పక్కన సినిమాలు చేసింది. దాదాపు అందరు అగ్ర హీరోల పక్కన ఆమె సినిమాలు చేసారు. అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది ఈమె.

Read more RELATED
Recommended to you

Latest news