తెలంగాణాలో రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ నెల రెండు రాజ్యసభ స్థానాలు తెలంగాణాలో ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలకు ఎవరిని అభ్యర్ధులుగా ఎంపిక చేస్తారు అనేది చివరి నిమిషం వరకు ఉత్కంట కొనసాగింది. ముందు టీఆర్ఎస్ అభ్యర్ధులుగా కే కేశవరావు, నమస్తే తెలంగాణా ఎండీ దామోదర్ రావు పేర్లను ఖరారు చేసారు. అయితే ఆ తర్వాత ఆయన స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని ఎంపిక చేసారు.
వీరు ఇద్దరు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేకే అభ్యర్ధిత్వం విషయంలో ముందు నుంచి ఉత్కంట నెలకొంది. ప్రస్తుతం ఆయన పార్లమెంటరి పక్ష నేతగా ఉన్నారు. ఆయనకు అనుభవం ఎక్కువ దీనితో ఆయనను మరోసారి పెద్దల సభకు పంపాలని కెసిఆర్ భావించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి పేర్లను రెండో స్థానం కోసం కెసిఆర్ పరిశీలించారు. అలాగే కవిత పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆఖరి నిమిషంలో సురేష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. సురేష్ రెడ్డికి మంచి వక్తగా పేరుంది. ఆయన 2018 ఎన్నికలకు ముందు తెరాస పార్టీలో జాయిన్ అయ్యారు. సమర్ధుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. దీనితో ఆయనను సభకు పంపాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లో ఇప్పుడు తెరాస, సిఏఏ, ఎన్సీఆర్ విషయంలో కేంద్రంపై పోరాడుతుంది. ఈ రెండింటిని తెరాస వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.