9 గంటల నుండే వీర రాఘవ హంగామా

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక హాసిని క్రియేషన్స్ లో రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ ఆగష్టు 15న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఇక అఫిషియల్ గా అది చెబుతూ వదిలిన టీజర్ పోస్టర్ అదిరిపోయింది.

చైర్ లో కూర్చుకున్న ఎన్.టి.ఆర్ డార్క్ లైట్ లో కవర్ చేస్తూ కింద ఒకతను పడి ఉన్నాడు. వెనుకాల కుర్చీలు పడి ఉన్నాయి. చూస్తే ఇది తప్పకుండా వినలకు వార్నింగ్ ఇచ్చే సీన్ లా ఉంది. అయితే మొత్తం డార్క్ లో షాడో ఇమేజ్ లా ఉండే సరికి పిక్ హైలెట్ అయ్యింది.

ఆగష్టు 15న ఉదయం 9 గంటలకు వీర రాఘవ టీజర్ వచ్చేస్తుంది. ఫస్ట్ లుక్కే అంచనాలను మించి ఉండగా ఈ టీజర్ ఇంకెలా ఉంటుందో అని నందమూరి ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ మొదలైంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ అంటున్నారు. సినిమా రిలీజ్ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా టీజర్ లో డిక్లేర్ చేసే అవకాశం కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version