స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్..!

-

కన్నడ స్టార్ హీరో ఈగతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ ను అరెస్ట్ చేయాలంటూ చిక్ మంగుళూరు కోర్టు వారెంట్ జారీ చేసింది. మే 22లోగా సుదీప్ ను ఎట్టిపరిస్థితుల్లో కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. కాఫీ ప్లాంటేషన్ ఓనర్ దీపక్ పటేల్ సుదీప్ పై పోలీస్ కేసు పెట్టారు. సుదీప్, కిచ్చ క్రియేషన్స్ లో కన్నడ టివి షో వారసదార షూటింగ్ కోసం పటేల్ ఎస్టేట్ ను అద్దెకు తీసుకున్నారు.

అద్దెగా కోటి 80 లక్షలు చెల్లించాలని వారి ఒప్పందం. అడ్వాన్స్ కింద 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బు చెల్లించకుండా ఎస్టేట్ లోని కాఫీ తోటల్ని, ఆస్థిని ధ్వంసం చేశారని పటేల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విషయంలో సుదీప్ ఎన్నిసార్లు నోటీసులు వచ్చినా వాయిదాలకు హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 22 లోగా కోర్టులో హాజరు కావాలని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version