Ashika Ranganath: క్యూట్‌ అందాలతో మెరిసిన ఆషికా

-

Ashika Ranganath: క్యూట్‌ అందాలతో మెరిసింది ఆషికా రంగనాథ్. ఆషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇకపోతే ఈ సినిమా తోనే తెలుగులో పాగా వేయాలనుకున్న ఈమె సినిమా రిజల్ట్ బెడిసి కొట్టడంతో ఈమె ఆశలు కాస్త అడియాశలు అయ్యాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకున్న ఈ భామకు తెలుగులో మంచి ఎంట్రీ దక్కినా ఫలితం మాత్రం దక్కలేదు.

Ashika Ranganath

2016లో కన్నడలో తెరకెక్కిన క్రేజీ బాయ్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయం అందుకోవడంతో ఈమెకు కూడా మంచి పేరు లభించింది. ఈ సినిమా తర్వాత శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన మాస్ లీడర్ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు పునీత్ రాజకుమార్ హీరోగా నటించిన జేమ్స్ అనే సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 2016 నుంచి 2022 వరకు కన్నడ ఇండస్ట్రీ పైనే దృష్టి సారించిన ఆషిక, ఆ తర్వాత 2022లో తొలిసారి అధర్వ హీరోగా నటించిన పట్టాతు అరసన్ అనే సినిమా ద్వారా తమిళ్ ఎంట్రీ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news