కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ‘ఓం భీమ్ బుష్’

-

ఓం భీం బుష్ – గత వారం థియేటర్లలో విడుదలైన సినిమాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా. ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మార్చి 22వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకులు ఎంతగానో మెచ్చే కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే అంచనాలకు మించి ఈ సినిమా అదరగొడుతోంది. మరోవైపు కళ్లు చెదిరేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సామజవరగమన తర్వాత శ్రీవిష్ణుకు మరో హిట్ ఖాతాలో పడినట్టైంది.

శ్రీవిష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాల ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు. ఈ చిత్రానికి తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తొలిరోజు 4.6 కోట్లు, రెండో రోజు 5.84 కోట్లు వచ్చినట్లు సమాచారం. మరోవైపు అమెరికాలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయట. మూడో రోజు వీకెండ్ సండే కావడంతో మరింత వసూళ్లు వచ్చినట్లు మూవీటీమ్ చెబుతోంది. మూడో రోడు మరో రెండు మూడు కోట్ల వరకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news