సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న అషూ రెడ్డి..!

-

అషు రెడ్డి అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ వరుస బోల్డ్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. సుక్ పూర్వజ్ దర్శకత్వంలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ తాజాగా ఒక కొత్త చిత్రాన్ని మొదలుపెట్టారు. మాస్టర్ పీస్ అనే టైటిల్ తో ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడు సిల్వర్ స్క్రీన్ పై చూడని సరికొత్త తెలుగు సూపర్ హీరోగా అరవింద్ కృష్ణ ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా అషు రెడ్డి అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇది తెలిసి ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇది చూసిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అంటూ కూడా కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. నిజానికి స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్న అషూ రెడ్డి వరుస గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో బుల్లితెర రియాల్టీ షోలలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

ఆ తర్వాత వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అషు రెడ్డి కెరీర్ కు ప్లస్ అయిందని చెప్పాలి. అంతేకాదు మొన్న మధ్య ఏకంగా ఈమె కాలివేళ్ళ ను రాంగోపాల్ వర్మ నోట్లో కూడా పెట్టుకోవడం పలు సంచలనాలకు దారి తీసింది. ఈ విషయంపై రాంగోపాల్ వర్మపై విపరీతమైన ట్రోల్స్, కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించి.. ఆడదాని అందాన్ని ఆస్వాదించకపోతే వాడు మగాడే కాదు అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఏది ఏమైనా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news