కొండచరియలు విరిగిపడి.. 16 మంది పర్యాటకులు మృతి

-

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 50 కిలో మీటర్ల దూరంలోని బటాంగ్ కలి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది పర్యాటకులు దుర్మరణం చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో 17 మంది ఆచూకీ తెలియడం లేదని ఆ దేశ అధికారులు తెలిపారు.

 

సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక శిబిరంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 94 మంది మలేసియన్లు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరిలో 59 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఘటనా స్థలి వద్ద 400 మంది సిబ్బంది, జాగిలాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3 గంటలలోపు ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఉన్న భాగం నుంచి కొండచరియలు వ్యవసాయ క్షేత్రంలోకి కూలినట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడినప్పుడు పెద్ద శబ్ధం వచ్చిందని ప్రమాదం నుంచి బయటపడినవారు తెలిపారు. ఆ ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కూడా పడలేదు. ఓ మోస్తరు వర్షమే కురిసిందని స్థానికులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news