`రాజుగారి గది 3` నుంచి తమన్నా త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఇదే..

-

రాజుగారి గది సినిమాకు మరో సీక్వెల్ గా `రాజుగారి గ‌ది 3` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇక ‘రాజుగారి గది 3’ ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికా గోర్‌ జంటగా నటించారు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా త‌మ‌న్నాను ఫిక్స్ చేశారు.

కానీ సడన్ గా ఈ చిత్రం నుండి తమన్నా త‌ప్పుకుంది. అయితే ఎందుకు తప్పుకున్నది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో అశ్విన్ బాబు దీనిపైన ఓ క్లారిటీ ఇచ్చాడు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం కారణంగా త‌మ‌న్నా రాజుగారి గ‌ది 3 నుండి తప్పుకున్నారు. రెండు షెడ్యూల్స్ లేట్ కావ‌డం, అక్టోబర్ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా కోసం వేచి చూస్తే బాగోదని ఆమె స్ధానంలో అవికా గోర్‌ని తీసుకున్నామ‌ని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news