స‌ల్మాన్‌ఖాన్‌కి దిమ్మ‌దిరిగే షాకిచ్చిన ఆస్ట్రాల‌జ‌ర్‌!

-

క‌ల‌ర్స్ టీవీలో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ సీజ‌న్ 14 మొద‌లైంది. ఈ నెల 3న ఈ షోని ప్రారంభించారు. తెలుగు షోలో 16 మంది కంటెస్టెంట్‌లు వుంటే స‌ల్మాన్ షోలో మాత్రం 11 మంది మాత్ర‌మే కంటెస్టెంట్‌లు వున్నారు. అభిన‌వ్‌, ఇజాజ్‌, జాన్‌, జాస్మిన్‌, నిక్కి, నిశాంత్, ప‌విత్ర‌, రాహుల్ రుబియా, సారా , షెహ‌జాద్ లు ఈ సీజ‌న్‌లో పాల్గొంటున్నారు.

తొలి రోజు స‌ల్మాన్ కంటెస్టెంట్‌ల జాత‌కాల్ని చెప్పించ‌డానికి ఓ ఆస్ట్రాల‌జ‌ర్‌ని తీసుకొచ్చి బిగ్‌బాస్ స్టేజ్‌పై ఒక్కో కంటెస్టెంట్ జాత‌కాన్ని చెప్పించాడు. ప‌నిలో ప‌నిగా త‌న జాత‌కం కూడా చెప్ప‌మ‌న్నాడు. పెళ్లి గురించి కూడా వెల్ల‌డించ‌మ‌ని చెప్ప‌డంతో కంటెస్టెంట్‌ల‌లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే పెళ్లి విష‌యం అడిగిన స‌ల్మాన్‌కి ఆస్ట్రాల‌జ‌ర్ దిమ్మ‌దిరిగే షాకిచ్చార‌ట‌. జాత‌క రిత్యా గ్ర‌హాలు బాగా లేవ‌ని, ఈ జీవితంలోపెళ్లి యోగం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌. దీంతో షాక్ కు గురికావాల్సిన స‌ల్మాన్ పెద్ద ముప్పునుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని చిరున‌వ్వులు చిందించ‌డం కంటెస్టెంట్‌లని షాక్‌కు గురిచేసింద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news