టీజర్ తో ‘అశ్వద్ధామ’ అదరగొట్టాడుగా…..!!

-

క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో నటుడిగా అడుగుపెట్టిన నాగ శౌర్య, ఆ తరువాత ఊహలు గుసగుస లాడే అనే సినిమా సక్సెస్ తో మంచి బ్రేక్ ని సంపాదించాడు. అనంతరం దిక్కులు చూడకు రామయ్య, జాదూ గాడు, కల్యాణ వైభోగమే, జ్యో అచుతానంద, ఒక మనసు, లక్ష్మి రావే మాఇంటికి తదితర సినిమాల్లో నటించినప్పటికీ శౌర్యకు సరైన సక్సెస్ రాలేదు. ఆ తరువాత యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకతంలో నటించిన ఛలో సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు శౌర్య. ఇక ఇటీవల సమంతతో కలిసి ఓ బేబీ సినిమాలో నటించి,

మరొక సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం రమణతేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి నిర్మాణంలో తెరెకక్కుతున్న అశ్వద్ధామ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు శౌర్య. యాక్షన్ కథాంశంతో, మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, ఆడియన్స్ లో మంచి ఆసక్తికి రేకెత్తించింది. ఇకపోతే నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని అక్కినేని సమంత రిలీజ్ చేసారు. ఇక ఈ టీజర్ ని బట్టి చూస్తుంటే, ఈ సినిమా ఉమెన్ ట్రాఫికింగ్, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. ‘ఎలా ఉంటాడో తెలియని ఒక రాక్షసుడిని సంహరించడానికి నారాయణుడే అశ్వద్ధామ అవతారంలో రావాలి’

అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ఈ సినిమా టీజర్ సాగుతుంది. ఓవర్ ఆల్ గా ఈ టీజర్, సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ టీజర్ పై వీక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ని అందిస్తున్నారు. అయితే గతంలో శౌర్య తొలిసారిగా నటించిన యాక్షన్ మూవీ జాదూగాడు ఫెయిల్ అయింది. మరి చాలా గ్యాప్ తరువాత ఆయన నటిస్తున్న ఈ థ్రిల్లింగ్, యాక్షన్ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news