అఖిల్ నటన కన్నా.. గ్లామ‌ర్ వైపే మొగ్గుచూపుతున్నాడా?

-

అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన టైటిల్‌, ఏఎన్నార్‌, నాగార్జున క్లాసిక‌ల్ చిత్ర టైటిల్ పెట్టినా ల‌క్ క‌లిసి రాలేదు. ముచ్చ‌ట‌గా మూడో సినిమా ప‌రాజ‌యం చెందింది.

అఖిల్.. అక్కినేని న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయ‌న ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. తొలి సినిమానే వి.వి.వినాయ‌క్ వంటి మాస్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో అఖిల్ వంటి రెగ్యూల‌ర్ క‌మ‌ర్షియల్ సినిమా చేశారు. కానీ సినిమా మాత్రం బోల్తా కొట్టింది. ఆ త‌ర్వాత జీనియ‌స్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ సినిమాతోనైనా స‌క్సెస్ అందుకోవాల‌ని త‌పించాడు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో చేసిన వినూత్న‌మైన ల‌వ్ స్టోరీ ‘హ‌లో’ సైతం డిజాస్ట‌ర్‌గానే మిగిలిచింది. అదే టైమ్‌లో అఖిల్ న‌ట‌న‌లోనూ మార్పు లేదు. మెచ్యూరిటీ లేదు. మూడో ప్ర‌య‌త్నంగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో క‌లిసి ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చేశారు.

అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన టైటిల్‌, ఏఎన్నార్‌, నాగార్జున క్లాసిక‌ల్ చిత్ర టైటిల్ పెట్టినా ల‌క్ క‌లిసి రాలేదు. ముచ్చ‌ట‌గా మూడో సినిమా ప‌రాజ‌యం చెందింది. దీంతో వ‌రుస‌గా హ్యాట్రిక్ ఫ్లాఫ్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇది కూడా ల‌వ్ ప్ర‌ధానంగానే సాగుతుంద‌ట‌. అయితే అడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డం త‌న వ‌ల్ల కావ‌డం లేద‌నుకున్నాడో ఏంటో, గ్లామ‌ర్‌తోనైనా ఆక‌ట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టుంది.

తాజా సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌ల‌ని ఎంపిక చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నాని ఓ హీరోయిన్‌గా అనుకున్నారు. మ‌రోవైపు కైరా అద్వానీని కూడా ఫైన‌ల్ చేసే ఆలోచ‌న‌లో యూనిట్ ఉన్నార‌ట‌. అంతేకాదు, ఇందులో మూడో క‌థానాయిక‌కు చోటుంద‌ని తెలుస్తుంది. మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంద‌ని తెలుస్తుంది. ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో డియ‌ర్ కామ్రేడ్‌, బ‌న్నీ-సుకుమార్ సినిమా, మ‌హేష్‌- అనిల్ రావిపూడి చిత్రంలో, త‌మిళంలో కార్తీ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు కైరా.. గుడ్ న్యూస్‌, లక్ష్మీ బాంబ్ తోపాటు కార్గిల్ యుద్ధం నేప‌థ్యంలో రూపొందే ఓ చిత్రంలో సిద్ధార్థ మ‌ల్హోత్రా స‌ర‌స‌న న‌టించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version