రాహుల్ సిప్లిగంజ్… ప్రతిష్టాత్మక బిగ్ బాస్ అనే రియాలిటి షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సేలేబ్రేటి. ఆ షో లో అంత మందిని దాటుకుని విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ 3 టైటిల్ గెలిచిన తర్వాత అతని క్రేజ్ అమాంత౦ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక పునర్నవి భూపాలం తో అతనికి ప్రేమాయణం ఉందీ అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే అతనిపై తాజాగా బీర్ బాటిల్ తో ఎటాక్ జరిగింది. గత రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి రాహుల్ వెళ్ళాడు. అక్కడ ఉన్న యువకులు అతనితో అనుచితంగా ప్రవర్తించారు. దీనితో రాహుల్ వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో వాళ్ళు అతనిపై బీర్ బాటిల్ తో ఎటాక్ చేసారు. అతని తలపై బాటిల్ బలంగా కొట్టడం తో తీవ్ర రక్త స్రావమైంది.
ఈ విషయం గమనించిన అక్కడి సిబ్బంది అతన్ని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దాడి చేసిన వాళ్ళు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులు గా వార్తలు వస్తున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడి చేసిన వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.