పవన్ కళ్యాణ్ సీన్ కామెడీ చేశారు..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. సినిమా రిలీజ్ కు ముందే లీక్ అవడంతో సినిమా ఎలా ఆడుతుందో అనుకున్నారు. కాని ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో పవన్ మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. ఇక ఈ సినిమా తమిళ రీమేక్ గా వంత రాజవతాన్ వరువెన్ సినిమా వచ్చింది.

సుందర్ సి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాకు బలంగా చెప్పుకుని.. హిట్ కు ప్రధాన కారణంగా క్రేజ్ తెచ్చుకున్న క్లైమాక్స్ సీన్ అదరగొట్టింది. ఎన్నిసార్లు చూసినా మనసుని కదిలించే ఆ సీన్ లో పవన్ నటన అందరిని ఆకట్టుకుంది. అయితే శింబు నటించిన తమిళ అత్తారింటికి దారేది సినిమాలో మాత్రం ఆ సీన్ కామెడీ చేశారట. ఏమాత్రం ఎమోషన్ క్యారీ అవకుండా ఆ సీన్ వచ్చిందట.

కామన్ గా ఎమోషనల్ సీన్స్ వస్తే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతుంటారు. కాని తమిళ సినిమాలో ఆ సీన్ లో నవ్వుతున్నారని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికి పవన్ సినిమాను అక్కడ ఎంత నాశనం చేయాలో అంతా చేశారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news