ఎట్టకేలకు అవతార్-2 షూటింగ్ మొదలు ..ఇక మనదగ్గర కూడా …!

కరోనా మహమ్మారి వ్యాపించి అల్ల కల్లోలం సృషిస్తున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిత్ర నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు దారికొస్తున్నాయి. దీంతో ప్రేక్షకులందరూ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్బస్టర్ అవతార్ సీక్వెల్ అవతార్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అవతార్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి ప్రణాళిక మొత్తం సిద్ధంగా ఉందట. అవతార్ 2 కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ వచ్చే వారం న్యూజిలాండ్ కి వెళ్లనుందని లేటెస్ట్ న్యూస్. ఈ కరోనా నేపథ్యంలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించిన మొదటి హాలీవుడ్ బిగ్ మూవీ అవతార్ 2 కావడం విశేషం. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ని రీసెంట్ గా అవతార్ 2 నిర్మాతల్లో ఒకరైన జోన్ లాండౌ రాబోయే షూటింగ్ షెడ్యూల్ గురించి ప్రకటన చేశారు.

ఆయన సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.. లతో మిగిలిన తారాగణం యొక్క కొన్ని బిహైండ్ సన్నివేశాలను.. ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ది మాటాడోర్ కింద ఉన్న “హై స్పీడ్ ఫార్వర్డ్ కమాండ్ నౌక ”మరియు ది పికాడోర్ జెట్ బోట్ ఇవన్నీ సీక్వెల్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో జో సల్దానా సామ్ వర్తింగ్టన్ కేట్ విన్స్లెట్ ఇంక క్లిఫ్ కర్టిస్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ 3డి సినిమా 2021 డిసెంబర్ లో థియేటర్లలోకి రానుంది. ఇక మన దగ్గరకూడా జూన్ నుండి షూటింగ్స్ మొదలయ్యో అవకాశాలున్నాయి. టీవి, సినిమాల షూటింగ్స్ కి త్వరలో అనుమతులు రానున్నాయి.