తిరుగులేని అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌.. భారీ స్థాయిలో క‌లెక్ష‌న్లు..!

-

భార‌త్‌లో హిందీ, తెలుగు, త‌మిళం భాష‌ల్లో విడుద‌లైన అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌కు అన్ని వ‌ర్గాల సినీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ భార‌త్‌లో ఆరు రోజుల‌కు గాను మొత్తం రూ.261.75 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది.

మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో వ‌చ్చిన అవెంజ‌ర్స్ ఆఖ‌రి చిత్రం అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ భార‌త్‌లో క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా అటు హాలీవుడ్ బాక్సాఫీస్‌నే కాదు, ఇటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టిన‌ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ జోరుకు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ భార‌త్‌లో ఆరు రోజుల‌కు గాను మొత్తం రూ.261.75 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు రూ.53.15  కోట్ల వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు రూ.51.35 కోట్లు, 3వ రోజు రూ.54.3 కోట్లు, 4వ రోజు రూ.31.5 కోట్లు, 5వ రోజు రూ.31.65 కోట్లు, 6వ రోజు రూ.26.15 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఏ హిందీ సినిమా కూడా వారం రోజుల్లో ఈ స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను సాధించ‌లేదు.

భార‌త్‌లో హిందీ, తెలుగు, త‌మిళం భాష‌ల్లో విడుద‌లైన అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌కు అన్ని వ‌ర్గాల సినీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. ఆంథోనీ రుసో, జో రుసోలు తెరకెక్కించిన ఈ సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉండడంతో ప్రేక్ష‌కులు ప్ర‌తి సీన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ను న‌టులు చ‌క్క‌గా పండించ‌డంతో ప్రేక్ష‌కులు అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక‌పై ఈ సినిమా ఇంకెన్ని వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version