‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్.. బీ గ్రేడ్ సినిమా కన్నా దారుణం..

-

ఓ పక్క తెలుగు సినిమాలు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకునేలా సత్తా చాటుతుంటే మరో పక్క తెలుగు సినిమాను మరి దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బోల్డ్ సినిమాలు యూత్ ఆడియెన్స్ కు నచ్చేస్తున్నా వాటిలో కంటెంట్ కూడా అలానే ఉండేలా చూసుకోవాలి. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ఆరెక్స్ 100 సినిమానే రొమాన్స్ లో టాపు లేపింది అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్‌గా ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమా ట్రైలర్ సంచలనంగా మారింది.

ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండ్ అయ్యే వరకు ప్రతి సీన్ లో హీరో హీరోయిన్ రొమాన్స్.. అది కూడా శృతిమించి ఎక్కడ పడితే అక్కడ అన్నట్టుగా చివరి క్లాస్ రూం లో కూడా కానిచ్చేశారు. దానికితోడు పచ్చిబూతులు. సెన్సార్‌ అయ్యాక, సినిమాలో ఉంటాయో లేదో తెలియదుకానీ, ట్రైలర్‌ మాత్రం కావలసినంత చూపిస్తోంది. నరసింహా నంది డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్, దివ్య రావు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఇదివరకెపుడో మళయాళీలువాడిపారేసిన సి-గ్రేడ్‌, ఇప్పుడు తెలుగులో ఊపిరిపోసుకున్నట్టుంది.

ఈ సినిమా దర్శకుడు, నరసింహ నంది, మంచి విషయమున్న దర్శకుడే. గతంలో ‘1940లో ఓ గ్రామం’ సినిమాతో జాతీయ అవార్డు, నంది అవార్డు సాధించినవాడు.  ఆ సినిమా తనకు ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

అన్నట్లు, ఈ ట్రైలర్‌ ప్రారంభించడానికే వచ్చిన నటి జీవిత, చూసి షాకయింది పాపం. ఈ లిప్‌లాక్‌లు, రొమాన్స్‌ల గురించి కొంచెం ఘాటుగానే స్పందించింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు, ఇవన్నీ తన కూతుళ్లకు ఎక్కడ తగులుకుంటాయోనన్న భయం ఆమెతో అలా మాట్లాడించివుండొచ్చు. వాళ్లు కూడా హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు కదా మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version