హిందూస్థాన్ జీతేగా అంటున్న ఆయుష్మాన్ ఖురానా..‘అనేక’ భాషల్లో సినిమా ప్రమోషన్స్..

-

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘అనేక్’. ‘తప్పడ్, ముల్క్, ఆర్టికల్ 15’ ఫేమ్ అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇష్యూస్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సమస్యలను పరష్కరించే ఆర్మీ ఆఫీసర్ రోల్ ను స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్లే చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు చక్కటి స్పందన లభిస్తోంది.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ‘అనేక్’ పిక్చర్ ను ప్రమోట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో ‘అనేక్’ చిత్ర నటీ నటులు, టెక్నీషియన్స్, డైరెక్టర్, హీరో, హీరోయిన్స్ ‘అనేక’ భాషల్లో అనగా భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో జీతేగా హిందుస్థాన్ అని చెప్పారు.

#JeetegaKaunHindustan హ్యాష్ ట్యాగ్ జీతేగా కౌన్ హిందుస్థాన్ అనే డైలాగ్ ‘అనేక్’ ట్రైలర్ లో వినిపించింది. ఈ క్రమంలోనే సేమ్ డైలాగ్ తో ప్రమోషన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ పిక్చర్ డెఫినెట్ గా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా గత చిత్రం ‘ఛండీఘర్ కరే ఆషికి’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, ఈ మూవీ డెఫినెట్ గా అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version