ఈ ఆలయాల మిస్టరీలను మీరు ఛేదించగలరా..?

-

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఏటా కొన్ని కోట్ల ఆదాయం ఆలయాలకు వస్తుంది. చెడు జరుగుతుందన్న భయం, మంచి జరుగుతుందన్న ఆశ మనిషితో ఏపని అయినా చేయిస్తాయి. దేన్నైనా గుడ్డిగా నమ్మేలా చేస్తాయి. వాటిలో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి.. మరికొన్ని సైన్స్ చెప్పలేని సత్యాలు ఉండొచ్చు. ఆలయాల్లో ఉండే మిస్టరీలు కొన్ని నేటికీ హిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిపై సైంటిస్టులు సైతం ప్రయత్నాలు చేసి మా వల్ల కాదని చేతులెత్తేశారు. అలాంటి కొన్ని ఆలయాల ప్రత్యేకతలు, అక్కడ పాటించే వింత ఆచారాలు, వీడని మిస్టరీలు ఏంటో మీరు చూడండి.

బృహదీశ్వర ఆలయం..

తమిళనాడు తంజావూర్‌లోని… బృహదీశ్వరాలయం ఓ అద్భుతమైన కళ.. ఈ ఆలయంలో… ఎక్కువ భాగం ప్యూర్ గ్రానైట్‌తోనే నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే… ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ..ఎక్కడా… గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచీ గ్రానైట్ తీసుకొచ్చారు? అసలు ఎలా తెచ్చారు? అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లూ లేకుండా…. ఆ భారీ శిలను, అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది.

బుద్ధ నీలకంఠ ఆలయం..

నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఈ ఆలయం ఉంది. త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు… ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం… 5 మీటర్ల పొడవైన రాతితో చెక్కివుంది. సహజంగా విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం స్వామి… వెల్లకిలా పడుకొని, నింగివైపు చూస్తుంటాడు. ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటూ… పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం… 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం… 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోందని స్పష్టమైంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం… సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు.

బుల్లెట్ ను పూజించే ఆలయం..

బుల్లెట్‌ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశారా…రాజస్థాన్‌లోని జోధపూర్‌లో ఉంది. ఇక్కడి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను భక్తులు పూజిస్తారు. లిక్కర్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా… దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకమట.. దీని వెనక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా… ఈ గుడి ఉన్న ప్లేస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్‌ని తీసుకెళ్లి… స్టేషన్‌లో పెట్టుకున్నారు. అయితే తెల్లారేసరికి… ఈ బైక్… తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్‌లో కనిపించింది. షాకైన పోలీసులు… మళ్లీ బైక్‌ని తీసుకెళ్లి… ఈసారి గొలుసులతో కట్టేశారు. అయినా అంతే మరుసటి రోజు ఈ బైక్… ప్రమాదం జరిగిన ప్లేస్‌లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో… విసుగొచ్చిన పోలీసులు… దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్‌ని పూజిస్తూ… బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. అసలు అలా ఎందుకు జరిగిందనే ఇప్పటికీ మిస్టరీయే.

హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్

మహారాష్ట్ర శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఓ బండరాయి ఉంది. ముంబైకి 16 కిలోమీటర్ల దూరంలో పుణె శివార్లలో ఆ దర్గా ఉంది. దర్గాకు ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ.. అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం… దానితో ముడిపడివున్న అంతుబట్టని మిస్టరీయే. 90 కేజీల ఆ రాయిని… ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరివల్లా కావట్లేదు. అదే 11 మంది కలిసి… చుట్టూ మూగి… చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రమే… ఈజీగా లేస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు… ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు అంటున్నారు.

నిధివనం రంగ మహల్

ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది నిధివనం రంగ మహల్ టెంపుల్ ఉంది.. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికులు నమ్ముతారు. అందుకే… సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్‌లోకి వెళ్తే… వాళ్లు చనిపోతారనీ లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని విపరీతమైన ప్రచారం ఉంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి… చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్నా ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చగా ఉంటాయి. వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకూ రాత్రి వేళ టెంపుల్‌లోకి ఎవర్నీ అనుమతించలేదు. అందువల్ల… నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్‌లో హర్రర్ సినిమాలు కూడా తీశారు.

వీరభద్ర ఆలయం..

అక్కడా ఇక్కడా కాదు.. మన ఆంధ్రాలోనే అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలోని వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఓ మిస్టరీ ఉంది. ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80 శాతం గాల్లో వేలాడుతూ ఉంటుంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచీ క్లాత్‌ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్టూ లేకుండా… భూమిని 20 శాతమే టచ్ చేస్తూ… ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా ఎలా నిలబడింది అనేది ఆశ్చర్యమే.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version