‘బేబీ’ సినిమాకు 2 రోజుల్లో ఎన్ని రూ.కోట్లు వచ్చాయంటే?

-

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్​గా ఈ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ని సాయిరాజేశ్‌ తెరకెక్కించాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది.

చిన్న సినిమాగా వచ్చిన ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శుక్ర, శనివారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.13.30 కోట్ల గ్రాస్ సాధించింది. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ. 9.80 కోట్లు వచ్చాయి. ఇవాళ ఆదివారం కావడంతో చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమా బడ్జెట్ రూ. 10 కోట్లలోపే ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news