బాలకృష్ణ సిఎం క్యాండిడెట్.. ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..!

-

ఏపిలో ఎలక్షన్స్ టైం దగ్గరపడుతుండగా టిడిపి, వైసిపి, జనసేన ఎవరికి వారు ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా వ్యూహ రచనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న టిడిపి వరాల జల్లు కురిపిస్తుంది.. ప్రతిపక్షంలో ఉన్న జగన్ సంకల్ప యాత్రతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక పవన్ కూడా ఈసారి ఎన్నికల్లో తన ప్రభావం చూపిస్తానని చెబుతున్నాడు. ఇదిలాఉంటే టిడిపి నుండి ఈసారి సిఎం క్యాండిడెట్ గా నందమూరి బాలకృష్ణ నిలబడుతున్నాడట.

ఏంటి ఈ వార్త నిజమేనా అనుకోవచ్చు.. అయితే బాలయ్య సిఎం క్యాండిడెట్ అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందట. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తుండగా ఒక పాత్ర సిఎంగా కనిపిస్తుందట. అయితే రియల్ లైఫ్ లో చంద్రబాబు ఎలాగు ఉన్నాడు కాబట్టి బాలయ్య వెండితెర మీద సిఎంగా కనిపిస్తాడు. అయితే ఒకవేళ అదే జరిగితే వెండితెర మీద బాలకృష్ణ ఎన్.టి.ఆర్ పాత్రలో ఒకసారి సిఎంగా కనిపిస్తే.. బోయపాటి సినిమాలో రెండోసారి సిఎంగా కనిపిస్తాడని చెప్పొచ్చు. వినయ విధేయ రామ సినిమా అంచనాలను అందుకోకపోవడంతో బోయపాటి శ్రీను ఎలాగైనా సరే బాలయ్య సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news