మళ్ళి అదే పంథాలో బాలయ్య – బోయపాటి సినిమా….??

-

టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల ఘోర పరాజయాలతో కెరీర్ పరంగా కొంత ఆలోచనలో పడ్డారు. దానితో గత ఏడాది తనకు హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలోనే మళ్ళి సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక ప్రస్తుతం ఆయనతో కలిసి బాలయ్య చేస్తున్న సినిమానే రూలర్. బాలకృష్ణ ఒక పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాలయ్యకు ఎంతమేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమా తరువాత బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ మరియు కథ నేటితో సిద్ధం అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక అందుతున్న వివరాలను బట్టి, ఈ సినిమా కూడా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల మాదిరిగా బాలయ్య డ్యూయల్ రోల్ తో పాటు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో సాగనున్నట్లు సమాచారం.

 

అది మాత్రమే కాక, ఈసారి బోయపాటి ఈ సినిమా కథను మరింత పవర్ఫుల్ గా సిద్ధం చేసారని, అటు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ సినిమా తెరకెక్కబోతోందట. సంక్రాంతి కానుకగా ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను ఆగష్టు నెలలో విడులా చేసేలా ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయిందని, మరికొద్దిరోజుల్లో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని చెప్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news