బోయపాటి మూవీలో ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య?

-

ఇటీవల నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన ‘రూలర్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ త‌ర్వాత‌ బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా కథ ఇదేనంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక స్టోరీ లైన్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో బాలకృష్ణ ఆధ్యాత్మిక వేత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగేఆధ్యాత్మికతతో మొదలై బాలయ్య పాత్ర కూడా చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

అయితే బాలకృష్ణ అలా మారడానికి కారణం ఏమిటి? అంతకుముందు ఆయన పాత్ర తీరు తెన్నులేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బాలకృష్ణ సరసన ఇద్దరు కథానాయికలు ఉండనున్నట్టు తెలుస్తోంది. వాళ్ల ఎంపిక విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ సినిమాలో బాలకృష్ణను ఎదుర్కునే విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు బాల‌య్య‌.

Read more RELATED
Recommended to you

Latest news