ఒకే వేదికపై ఎన్టీఆర్, బాలయ్య

-

హరికృష్ణ మరణించడంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైంది. కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఎన్.టి.ఆర్, బాలకృష్ణను హరికృష్ణ కలిపారు. హరికృష్ణ అంత్యక్రియ కార్యక్రమాలు బాలయ్య దగ్గర ఉండి చూసుకున్నాడు. అన్న పిల్లలకు తానున్నా అంటూ ఆత్మీయతను పంచారు. అయితే అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ గెస్ట్ గా వస్తారని అనుకున్నారు. కాని ఎందుకో అప్పుడు బాలయ్య రాలేకపోయారు.

అయితే అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య వస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ 21 ఆదివారం శిల్పకళావేదికలో నందమూరి ఫ్యాన్స్ అందరి ముందుకు ఒకే వేదిక మీద ఎన్.టి.ఆర్, బాలకృష్ణ కనువిందు చేయనున్నారు. ఈ కలయిక కోసం నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మరి అబ్బాయ్ గురించి బాబాయ్.. బాబాయ్ గురించి అబ్బాయ్ ఏం మాట్లాడుతారు. అభిమానుల ముందు ఎలా కలుస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇది కేవలం సినిమా సక్సెస్ మీట్ మాత్రమే కాకుండా రాజకీయ ప్రచారానికి కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్నర్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version