సెన్సార్ పూర్తి చేసుకున్న వీర సింహ రెడ్డి! ఇక దబిడి దిబిడే.!!

-

నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి 12 తేదీన విడుదల కు   సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలయ్య కు తగ్గట్టుగా  అదిరిపోయే ఫైట్స్ , సూపర్ డైలాగ్స్,  సూపర్ క్లైమాక్స్  ఉండనున్నాయట.  ఈ సినిమా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా మాస్ ను రాప్పడించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ టీజర్, సాంగ్స్ సినిమా పై  అంచనాలు విపరీతంగా పెంచాయి. బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో , అలాగే గోపి చంద్ మలినేని  సూపర్ హిట్ క్రాక్ తర్వాత వస్తుండంతో ఫ్యాన్స్ లో  జోష్   ఉంది . ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పొలిటికల్ గా కూడా వివాదాస్పదం అయింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందుగా ఏర్పాట్లు చేసుకున్నా గాని చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వక వేరే చోటుకు మార్చారు. అయినా కూడా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలయ్య స్పీచ్ హైలెట్ అయ్యింది. ఇక తాజాగా ఈ చిత్రం కు  సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ చూసిన వారు ఫైట్స్ సూపర్ గా ఉన్నాయని చెప్పారట.ఈ చిత్రం కు సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీనితో ఎటువంటి అడ్డంకులు లేకుండా బాలయ్య బాబు సంక్రాంతి పండుగకు థియేటర్ల లో సందడి చేయబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version