చిరంజీవి అల్లుడి కోసం బాలయ్య వస్తున్నాడా!

-


మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం విజేత. డెబ్యూ దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. శుక్రవారం రోజు విడుదలైన చికెన్ సాంగ్ మాస్ ప్రియులని ఆకట్టుకుంటోంది.

విజేత ఆడియో వేడుక ఈ నెల 24 న వైభవంగా జరగనుంది. తాజాగా జరుగుతున్న ప్రచారం సినీవర్గాల్లో చర్చనీయాంశగా మారింది. ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరు అతిధిగా హాజరు కానున్నారు. అల్లుడి చిత్రం కాబట్టి ఇందులో పెద్ద విశేషం లేదు. కానీ బాలయ్య కూడా హాజరు కానున్నాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి.విజేత చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి బ్యానర్ లో నిర్మించబడుతోంది. ఆ సంస్థతో ఉన్న అనుబంధంతోనే బాలయ్య ఈ వేడుకకు అతిధిగా హాజరుకాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్ ఈ వార్తపై అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version