నా వయస్సు ఇంకా 36 ఏళ్లే – బాలయ్య

-

తన పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలయ్య. నా పుట్టినరోజున కౌంట్ డౌన్ గా పెట్టుకుంటాను… ఎప్పుడు నా వయస్సు నీ తిరిగేస్తాను… 36లాగా ఫీల్ అవుతానంటూ పేర్కొన్నారు బాలయ్య. హాస్పిటల్ నుంచి ఒక పేషంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు అంటే అది నాకు పండగ…లాంటిదేనని… అందరూ మహానుభావులు కాలేరు… చాలామంది పుడతారు…గిడుతారు… కానీ అందరూ మహానుభావులు కాలేరని తెలిపారు.

అటువంటి వారు గొప్ప గొప్ప పనులు చేస్తారు…అప్పట్లో నాన్న గారు పార్టీ నీ స్థాపించడం… ఎంతోమంది పేదలకోసం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించడం… చాలా గొప్ప గొప్ప పనులు స్మరించుకోవాలని కోరారు నందమూరి బాలకృష్ణ.ఈ ఆస్పత్రి ఏ ఉద్దేశంతో అయితే స్థాపించామో అది నెరవేర్చేందుకు ఇక్కడి స్టాఫ్… ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు…ఈ ఆస్పత్రి కి ఛైర్మెన్ గా ఉండటం నా పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తుంటానని వెల్లడించారు. దేశంలో ఈ ఆస్పత్రిని రెండో గొప్ప అస్పత్రిగా గుర్తించడం చాలా ఆనందంగా ఉందని… అందరూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ. మన ఆలోచనలకు బానిసగా మన శరీరాన్ని చేసుకోవాలని వెల్లడించారు నందమూరి బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version