సామాన్యుడితో బాలయ్య సరదా సంభాషణ.. వీడియో వైరల్

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. శ్రుతిహాసన్, బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి దిగిన ఫొటో ఇటీవల మేకర్స్ షేర్ చేయగా, అది నెట్టింట బాగా వైరలయింది. కాగా, తాజాగా సామాన్యుడితో ఓ హోటల్ లో బాలయ్య సరదా సంభాషణకు సంబంధించిన వీడియో బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో బాలయ్య హ్యాపీగా ఓ సామాన్యుడితో సరదాగా ముచ్చటించారు. తాను హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా, ప్రముఖ సినీ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కొంత మంది పనిలేక బేకార్ గా ఉన్నారని చెప్పారు. టర్కీలోని ఓ రెస్టారెంట్ లో ఈ సంఘటన జరిగింది.

సరదాగా ఓ కుటుంబంతో బాలయ్య ముచ్చటించారు. వారితో కలిసి టిఫిన్ చేసిన బాలయ్య..పలు విషయాల గురించి వారికి చెప్పారు. ఏం పని చేయకుండా ఖాళీగా ఉండేవారికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని తెలిపారు.

ఇక అక్కడ ఉన్న మహిళను చూపించి బాలయ్య ..వాళ్లు ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తుంటారని, వాటి వలన మెదడు పాడవుతుందని చెప్పారు. తన ఉద్దేశం ప్రకారం.. టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిదని, అసలు చూడకపోతే మెదడుకు ఇంకా మంచిదని పేర్కొన్నారు. అలా సరదాగా హిందీలో టర్కీకి చెందిన ఓ కుటుంబంతో బాలయ్య ముచ్చటించారు. తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 50 ఏళ్లు అయిందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసి సినీ అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. అగ్ర కథానాయకుడు అయినప్పటికీ సరదాగా ఏ మాత్రం గర్వం లేకుండా చక్కగా సామాన్యుడి కుటుంబంతో ముచ్చటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version