జగిత్యాల జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడు క్రూరత్వం బయటపడింది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ చైతన్య స్కూల్‌లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట ఓ విద్యార్థినిని సదరు ఉపాధ్యాయుడు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్నిబాధిత విద్యార్థిని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతనిపై పొక్సో చట్టం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.