రష్మీక మందాన పై బ్యాన్.. నష్టాల బాట పట్టిన పుష్ప -2..!

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కన్నడ పరిశ్రమ తిరస్కరణకు గురి కానున్నారు అని, ఆమెను బ్యాన్ చేసే ఆలోచనలలో కన్నడ పరిశ్రమ ఉందంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే జరిగితే ఆమె అప్కమింగ్ చిత్రాలు పూర్తిస్థాయిలో నష్టపోతాయని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఇండస్ట్రీకి చెందిన ఈమె చర్యలు కనడ పరిశ్రమలు ఆగ్రహానికి గురి చేస్తున్నాయని వాదన ఇట్లు ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి గత నాలుగు సంవత్సరాల నుంచి కన్నడ పరిశ్రమ రష్మిక మందాన పై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీనికి తోడు రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతారా సినిమా కూడా ఇంకా చూడలేదంటూ ..త్వరలోనే చూస్తానంటూ చెప్పి కన్నడిగులకు మళ్లీ ఆగ్రహాన్ని తెప్పించింది. దేశ ప్రజలు మెచ్చిన ఈ సినిమాను కన్నడ ఇండస్ట్రీకి చెందిన దానివై ఉండి కూడా ఇంకా ఎందుకు చూడలేదు ? అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ ప్రజలు. ఈ విషయంపై కూడా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకే ఈమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా శాండిల్ వుడ్ బ్యాన్ చేసే ఆలోచన చేస్తున్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు కూడా రష్మిక మిగతా సౌత్ లాంగ్వేజెస్ మాదిరి కన్నడ భాష కూడా నేను మాట్లాడ్డానికి ఇబ్బంది పడతానని చెప్పింది. తనకు మాతృభాష మాట్లాడడం రాదని చెప్పడం ద్వారా ఆమె కన్నడను అవమానించారని పెద్ద ఎత్తున ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ఈమె చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.. ఈ రెండు సంఘటనలతో పాటు రష్మిక లేటెస్ట్ ఇంటర్వ్యూ కూడా వ్యతిరేకతకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ ఓనర్స్ , ఆర్గనైజేషన్ కలిసి ఈమెను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఈమెను బ్యాన్ చేస్తే పుష్ప 2 సినిమాకు కూడా భారీ స్థాయిలో నష్టం కలిగినట్టే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news