ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలలో బండ్ల గణేష్‌కు పరాభవం తప్పలేదు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి గెలుపొందిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించారు.
వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. రెండేళ్లకోసారి ఎఫ్ ఎన్ సీసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4600 సభ్యులు ఉన్న ఈ కల్చరల్ సెంటర్ లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అల్లు అరవింద్, సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానల్ సభ్యులే గెలుపొందారు. ముళ్లపూడి మోహన్ సెక్రటరీగా, తుమ్మల రంగారావు వైస్ ప్రెసిడెంట్ గా, రాజశేఖర్ రెడ్డి ట్రెజరర్ గా, వివిఎస్ఎస్ పెద్దిరాజు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇదే కమిటీలో మెంబర్స్ గా ఏడిద రాజా, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, సిహెచ్ వరప్రసాదరావు, శైలజ కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీ మోహనరావు, బాలరాజు, గోపాలరావు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.