వామ్మో.. స‌రిలేరు సినిమాకు బండ్ల గణేష్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిచారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ ఓ దొంగ పాత్రలో నటించారు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో బండ్ల గణేష్ ఓ పది నిముషాలు కనిపిస్తారు.

కానీ అక్కడ అయన కామెడీ అంతగా పండలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పాత్ర కోసం అయనకి 20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, కమెడియన్ గా సినీ కెరీర్ ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించాడు. అందులో భాగంగానే గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సినిమాలు వచ్చాయి. ఇక గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజులకి పూర్తిగా రాజకీయాలకి పూర్తిగా రాజీనామా చేశారు. ఎన్నికలప్పుడు అయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అదే కామెడీని తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి.