అలా చేస్తే.. ఆత్మహత్యనే శరణ్యం – బండ్ల గణేష్ సంచలన ట్వీట్

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయాలపై, నటులపై ఆయన చేసే కామెంట్స్ తరచూ వివాదాస్పదంగా మారుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే…మరో సంచలన ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌.

నేను ఇతరులను అనుకరించను, నేను నాలాగే ఉంటాను, ఎందుకంటే ఈర్షా, అజ్ఞానం, అనుకరణ ఆత్మహత్యతో సమానం.. కనుక. అది అందరికీ నచ్చినా నచ్చకపోయినా
ఇతరులకు ఆనందం ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో మనకున్న కష్టాలను కుడా మర్చి పోతాం. ఇతరులకు మంచి చెస్తే మనకు మనమెంతో మేలు……! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version