మ్యూజిక్ లెజెండ్ బప్పిలహరి మరణించడం అన్ని ఇండస్ట్రీలక షాక్ కు గురిచేసింది. ఆయన హఠాన్మరణంతో పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బప్పీ లహరి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి మృతికి చిరంజీవి సంతాపం… బప్పి లహిరి కన్నుమూత తీవ్ర ఆవేదనను కలిగించిందన్న చిరంజీవి… తన సినిమాలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి సూపర్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకుంటూ, ఆయన లేని లోటు తీర్చలేదనిదని’ ట్విట్ చేశారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బప్పిలహరి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించారు. పశ్చిమ బెంగాల్ జల్పాయ్ గుడిలో జన్మించిన ఆయన హిందీ, తెలుగు, గుజరాతీ, కన్నడతో పాటు పలు భాషల్లోని సినిమాలకు సంగీతాన్ని అందించారు. తెలుగులోనూ చాలా సినిమాలకు సంగీతాన్ని అందించారు. సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాకు బప్పీలహరి మ్యూజిక్ అందించారు. అప్పట్టో ఈ సినిమాలోని పాటలు సెన్సెషన్ క్రియేట్ చేశాయి.
Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022