బ్యూటిఫుల్ మెలోడియస్ గా హాయ్ నాన్న మూడో సాంగ్..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో నాచురల్ పెర్ఫార్మర్ మృణాల్ ఠాకూర హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రమే “హాయ్ నాన్న”. మరి నాని కెరీర్ లో క్యాల్షిక్ హిట్ చిత్రం “జెర్సీ” అనంతరం మళ్ళీ ఓ ఫాథర్ సెంటిమెంట్ చిత్రంగా దీనితో రాబోతుండగా దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటివరకు కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోగా ఈ సాంగ్స్ తర్వాత మేకర్స్ ఇప్పుడు మూడో సాంగ్ ని అయితే లాంచ్ చేశారు. మరి మృణాల్ ఠాకూర్ తన భర్తపై తమ మూడో యానివర్సరీ కానుకగా తన భర్త కి ఓ సాంగ్ డేడికేట్ చేస్తూ స్టార్ట్ అయ్యిన ఈ సాంగ్ మంచి బ్యూటిఫుల్ మెలోడియస్ గా ఉందని చెప్పాలి.

సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహద్ బ్యూటిఫుల్ వర్క్ అందించాడు అని చెప్పాలి. అలాగే వీడియో విజువల్స్ లో మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 7న సినిమా రిలీజ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news