బ్యూటీ స్పీక్స్ : ఆ అందానికి సాహో అనండ్రోయ్! 

-

ఫ‌స్ట్ టేక్ :  బుజ్జిగాడి పోరీ మాళవిక మోహ‌న్

క్రేజీ స్టార్ ప్ర‌భాస్
మ‌రో క్రేజీ స్టార్ హీరోయిన్ తో
జ‌త‌క‌ట్టి అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు.
ఆ భామ అందం అభినయం రెండూ అపురూప‌మే!హాట్ బ్యూటీ మాళవిక మోహ‌న్ త్వ‌ర‌లోనే ఇటుగా రానుంది.మ‌నంద‌రి బాహుబ‌లితో..మ‌నంద‌రి బుజ్జిగాడితో రొమాన్స్ చేయ‌నుంది.త‌మిళ నాట త‌న అంద‌చందాల‌తో సంచ‌ల‌నం రేపుతున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడిక తెలుగు చిత్ర సీమ‌పై కూడా క‌న్నేసింది.ఎప్ప‌టి నుంచో ఇక్క‌డి సినిమాలు చేయాల‌న్న త‌ప‌న‌తో ఉన్న మాళ‌విక అనుకోకుండానే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.అమ్మాయిలు సైతం క‌న్నుకుట్టుకుని తీరే రీతిలో త‌న‌దైన స్టైల్ లో త్వ‌ర‌లో మ‌నంద‌రికీ అందాల విందు అందించ‌నుంది.
Malavika Mohanan/మాళవిక మోహ‌న్
బుజ్జిగాడి పోరీ మాళ‌వికా మోహ‌న్ ..అవును!మ‌న బుజ్జిగాడితోనే మాళ‌వికా మోహ‌న్ త్వ‌ర‌లో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.ఇప్పుడీ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.త్వ‌ర‌లో ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించే ప్యాన్ ఇండియా చిత్రంలో ఆమె న‌టించ‌బోతోంది.మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు ప్రారంభం అయ్యాయి.

ప‌క్కా  క‌మ‌ర్షియ‌ల్ మార్క్ చిత్రాలు రూపొందించే మారుతి చేతిలో ఈ క్రేజీ ప్రాజెక్టు వ‌చ్చి ప‌డింది.ఈ సినిమా క‌నుక భారీ విజ‌యం అందుకుంటే అటు డైరెక్ట‌ర్ మారుతికీ,ఇటు హీరోయిన్ మాళ‌వికకూ కెరియ‌ర్ బ్రేక్ దొర‌క‌డం ఖాయం.అటు ప్ర‌భాస్ అభిమానులు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎదురు చూస్తున్నారు.ప్ర‌స్తుతం లీక్ అయిన ఈ క్రేజీ అప్టేడ్ విని వాళ్లంతా ఎంతో సంతోషిస్తున్నారు.

ఇప్ప‌టికే త‌మిళ చిత్ర సీమ‌లో మంచి పేరు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ త్వ‌ర‌లోనే తాను ఎదురు చూస్తున్న క‌ల‌ను నిజం చేసుకోనుంది.ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న‌కు మ‌హేశ్ బాబు స‌ర‌స‌న న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది.ఆ క‌ల కూడా త్వ‌ర‌లోనే నిజం కావాల‌ని కోరుకుందాం.కాగా ఈ అందాల భామ టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ న‌టించిన మ‌హ‌ర్షి సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ కేఎస్ మోహ‌నన్ కుమార్తె కావ‌డం ఓ విశేషం.ఆ విధంగా ఆమె తెలుగు సినిమాల‌పై ఎక్కువ ప్రేమ పెంచుకుంద‌ని భావించాలి.గ‌తంలో ర‌జ‌నీ హీరోగా రూపొందిన పేట సినిమాలో ఓ  స‌హాయ పాత్ర‌లో న‌టించి,అల‌రించింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో పాటు ఆయ‌న అల్లుడు ధ‌నుష్ న‌టించిన డీ43 సినిమాలో కూడా న‌టించింది.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగిడ‌బోతున్న ఈ త‌మిళ కుట్టీకి ఆల్ ద బెస్ట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version