రష్మిక హడావుడి మామూలుగా లేదుగా గురూ…!

-

యంగ్ హీరో నితిన్, రష్మిక మందిన హీరోహీరోయిన్లు గా నటించిన చిత్రం భీష్మ. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయం నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు సిని విశ్లేషకులు కూడా.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పాటలు బయటకు వచ్చాయి. అలాగే సినిమా ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. సినిమా ప్రచారం కూడా ఒక రేంజ్ లో చేస్తుంది చిత్ర యూనిట్. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో మరో వీడియో ని విడుదల చేసింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన మేకింగ్ వీడియోను యుట్యూబ్ లో రిలీజ్ చేసింది.

ప్రధానంగా ఈ వీడియోలో రష్మిక చేసిన సందడి హైలైట్‌ అనే చెప్పవచ్చు. నితిన్, రష్మిక మధ్య సన్నివేశాలు కాస్త సందడి సందడి గా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దాదాపుగా 23 కోట్లకు అమ్ముడుపోయింది. సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దీనితో నితిన్ భీష్మ సినిమా అయినా ఎంత మేర ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news