నాగ చైతన్య ” లవ్ స్టోరీ ” కి ముందే శేఖర్ కమ్ముల కొత్త సినిమా …!

టాలీవుడ్ లో డాలర్ డ్రీంస్, ఆనంద్, గోదావరి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఇక ఆయన గత చిత్రం ఫిదా కూడా అద్భుతమైన కమర్షియల్స్ సక్సస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి లతో లవ్ స్టోరీ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరో 15 రోజుల మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ లోపే శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమాను లాక్ చేసేశాడు.

 

అయితే ఈ సినిమాని కూడా ‘‘లవ్ స్టోరీ’’ నిర్మించిన నిర్మాత కావడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటించనున్నారు. సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా సైలెంట్ గా చేసుకుంటున్నారు. లవ్ స్టోరీ సినిమా కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ కమ్ములను చేయమని కోరగానే.. వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ కరోనా క్రైసిస్ లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డిసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనానికి నిదర్శనం అని చెప్పుకోవాలి.లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. శేకర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు త్వరలో తెలియనున్నాయి. అయితే ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.