నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే

-

ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ను అందిస్తూ అలరించే ఓటీటీలు డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అలా ఈ వారం కూడా పలు ఓటీటీలలో చాలానే సినిమా సిరీస్లు వచ్చాయి. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్లో అయితే మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సిరీస్లు, సినిమాలు వచ్చేశాయి. ముఖ్యంగా సీటు అంచున ఊపిరి బిగపట్టుకుని టెన్షన్ టెన్షన్గా చూసేలా ఉత్కంఠభరమైన ట్విస్టులతో అదిరిపోయే ప్లాట్లతో థ్రిల్లర్స్ రెడీగా ఉన్నాయి. అలా వచ్చిన వాటిలో ఈ వారం అస్సలు మిస్ కానీ టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

మర్డర్ ముబారక్.. సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా నటించిన ఈ సినిమా ఓ హోటల్‌లో జరిగిన హత్య నేపథ్యంలో నడుస్తుందీ.

డామ్‌సెల్.. పెళ్లి తర్వాత ఓ యువరాణిని డ్రాగెన్ ఉన్న గుహలో పడేస్తే ఆ డ్రాగెన్ బారి నుంచి ప్రాణాలతో ఆ ప్రిన్సెస్ ఎలా బయపడిందనేదే ఈ సినిమా కథ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.

అన్వేషిప్పిన్ కండేతుమ్.. ఇందులో రెండు హత్య కేసులను ఛేదించే సీన్స్ను గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించారు. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు.

క్రిస్మస్.. క్రిస్మస్ పండగ రోజే జరిగిన ఓ హత్య కేసును ఛేదించే నేపథ్యంలో కథ సాగుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం చేశారు.

తుండు.. రణం, ఖతర్నాక్ చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన బిజూ మీనన్, దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన చిత్రమిది. రియాజ్ షరీఫ్ తెరకెక్కించిన ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news